ఎలుక మాంసాన్ని లొట్టలేస్తూ లాగించేస్తున్నారు

- December 27, 2018 , by Maagulf
ఎలుక మాంసాన్ని లొట్టలేస్తూ లాగించేస్తున్నారు

 

కుమారికటా(అస్సాం): తాజాగా పంటపొలాల్లో పట్టితెచ్చాం. తాజా ఎలుకలు వీటి మాంసం భలేరుచి అంటూ అస్సాంలోని కుమారికట మార్కెట్‌లో మహాజోరుగా ఎలుకలను అమ్ముతున్నారు. వీటిని ఉడకబెట్టి కొన్ని, తోలుతీసినవి కొన్నింటిని, మసాలాలు గుజ్జుతో కూర వండిన ఎలుక మాంసాన్ని మహాజోరుగా విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో చికెన్‌, పందిమాంసం కంటే ఎలుకమాంసం అంటే పడిచస్తున్నారు స్థానికులు. ఆదివారంమార్కెట్‌లో మొత్తం ఎలుకల మార్కెట్‌కే ఎక్కువ గిరాకీ ఉంటున్నది. మార్కెట్‌లో కొనుగోలుదారులు తాజాగా పట్టుకుని చర్మం తీసిన ఎలుకలను కొనుగోలుచేసేందుకు ఎగబడుతున్నారు. రైతులు తమ పంటపొలాలను ధ్వంసంచేయనీయకుండా ఎలుకలను పట్టిస్తుంటారు. ఈ వేటగాళ్లు పంటపొలాల్లో పట్టితెచ్చిన ఎలుకలను తాజాగా మాంసాన్ని తీసి విక్రయిస్తున్నారు. ఇక్కడి గిరిజన ప్రజలకు కూలీలకు ఎలుకల పట్టివేత, ఎలకల విక్రయం ప్రధాన వ్యాపకంగా మారింది. అస్సాంలోని తేయాకు తోటల్లో పనులు దొరక్కపోతే గిరిజన కూలీలు ఎలుకలను పట్టితెచ్చి విక్రయిస్తుంటారు. తేయాకు తీత నిలిచిపోతే గిరిజన కూలీలు పంటపొలాల్లోనికి వెళ్లి ఎలుకలను పడుతుంటారు. ఒక తాజా ఎలుక 200 రూపాయలు ఖరీదుచేస్తుంది.

చికెన్‌, పందిమాంసానికి కూడా ఇక్కడ అంతరేటులేదు. ఇటీవలికాలంలో ఈప్రాంతంలో పంటపొలాలకు ఎలుకల బెడద ఎక్కువ ఉందని రైతులు చెపుతున్నారు. పంటపొలాలను తినేస్తున్న ఎలుకలను ట్రాప్‌చేసి పట్టుకుంటామని ఒక ఎలుకల విక్రేత సాంబా సోరెన్‌ వెల్లడించాడు. పంటలు కోతకు వచ్చే సమయంలో పొలాల్లోనికి చొచ్చుకునివచ్చి మొత్తం పంటలను ధ్వంసంచేస్తాయి.

విక్రేతలు రాత్రిపూట వాటిని ట్రాప్‌చేసేందుకు ఎలుకలబోన్లు ఏర్పాటుచేసి పట్టేస్తుంటారు. వాటిని మరుసటిరోజే మార్కెట్‌కు తెచ్చి విక్రయిస్తుంటారు. ట్రేడర్ల అంచనాప్రకారంచూస్తే కొన్ని ఎలుకలు కిలోకంటే ఎక్కువ బరువుతో ఉంటాయి. ప్రతిరోజూ పదినుంచి 20 కిలోల మేర ఎలుకలను పట్టుకుని మార్కెట్‌కు తెస్తామని ఈ గిరిజన కూలీలు చెపుతుండటం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com