బాలయ్యకు బ్రహ్మరథం పట్టిన నిమ్మకూరు వాసులు

బాలయ్యకు బ్రహ్మరథం పట్టిన నిమ్మకూరు వాసులు

సొంతూరు నిమ్మకూరులో బాలకృష్ణకి ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రబృందం ఇవాళ నిమ్మకూరుకి విచ్చేసింది. ఎన్టీఆర్ వేషధారణలో పంచె కట్టుతో నిమ్మకూరు వచ్చిన బాలకృష్ణకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట బయోపిక్ లో నటించిన విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, డైరెక్టర్ క్రిష్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి బాలయ్య నివాళులర్పించారు.

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వాటిలో మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఈ నెల 9న విడుదలకానుంది. ఎన్టీఆర్ సినిమా విడుదల కాబోతున్న 100 థియేటర్లలో ప్రజల సందర్శనార్థం 100 ఎన్టీఆర్ విగ్రహాల్ని ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఆ వంద విగ్రహాల్లో మొదటి విగ్రహాన్ని ఇవాళ తిరుతిలోని పిజెఆర్ థియేటర్లో బాలయ్య, విద్యా బాలన్ ఆవిష్కరించనున్నారు.

Back to Top