సౌదీకి పంపించొద్దు అంటున్న యువతి...
- January 07, 2019సౌదీ అరేబియాకు చెందిన 18 ఏళ్ల రాహఫ్ అల్ కునన్ అనే అమ్మాయి .. ప్రస్తుతం బ్యాంకాక్‌లో చిక్కుకున్నది. కువైట్‌లో ఉన్న తమ పేరెంట్స్ నుంచి తప్పించుకున్న ప్రయత్నంలో ఆమె థాయిలాండ్ చేరుకున్నది. అయితే బ్యాంకాక్‌లోని ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను ఓ హోటల్లో బంధించారు. తిరిగి ఆ టీనేజర్‌ను కువైట్‌లో ఉన్న ఆమె పేరెంట్స్‌కు అప్పచెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కుటుంబసభ్యులతో తనకు ప్రాణ హాని ఉందని, తాను ఇస్లామ్‌ను వదిలివేశానని, అందుకే ఆస్ట్రేలియా పారిపోతున్నట్లు ఆమె ఓ వీడియో సందేశంలో చెప్పింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా థాయ్‌కు వెళ్లిన ఆ టీనేజర్‌ను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సౌదీ ఎంబీసీ అధికారులు ఆమెను ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ దేశమైనా తనకు ఆశ్రయం కల్పిస్తే అక్కడకి వెళ్తానని ఆమె తన వీడియో సందేశంలో కోరింది. ఇస్లామ్‌ను వదిలివేసి ఇంటికి వెళ్లిన వారిని దారుణంగా శిక్షిస్తారని, అందుకే తనకు కువైట్‌కు వెళ్లాలని లేదని ఆమె చెబుతోంది. ఐక్యరాజ్యసమితి తనకు ఆశ్రయం కల్పించాలని కోరుతోంది. గత ఏడాది ఆరంభంలో కూడా ఓ మహిళ ఇలాగే కెనడాకు పారిపోయేందుకు ప్రయత్నించింది.
ఆమెను పిలిప్పీన్స్ నుంచి కువైట్‌కు పంపించారు. కానీ ఇప్పటి వరకు ఆ మహిళ ఆచూకీ తెలియలేదు. అందుకే రాహఫ్ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు