యూఏఈలో: 104 వాహనాల ఆక్షన్
- January 07, 2019రస్ అల్ ఖైమా మునిసిపాలిటీ 104 అన్ క్లెయిమ్డ్ వాహనాల్ని ఆక్షన్‌కి పెట్టేందుకు రంగం సిద్ధం చేసింసది. ఆరు నెలలకు పైగా ఇంపౌండ్ అయిన వాహనాలు ఇవి. వీటి కోసం ఓనర్స్ ఎవరూ రాకపోవడంతో ఆక్షన్ వేయనున్నారు. రస్ అల్ ఖైమా మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ముంజిర్ బిన్ షుకర్ అల్ జాబి మాట్లాడుతూ, 104 వాహనాలు వివిధ ప్రాంతాలకు చెందినవని అన్నారు. పబ్లిక్ రోడ్స్, స్క్వేర్స్ మీద వాహనాల్ని ఓనర్లు వదిలి వెళ్ళినట్లు ఆయన వివరించారు. వార్నింగ్ లెటర్స్ వీటిపై అంటించినా ఎవరూ పట్టించుకోలేదనీ, 10 రోజుల తర్వాత వాటిని తొలగించామని చెప్పారు. చట్ట ప్రకారం నో క్లెయిమ్డ్ వాహనాల్ని ఆరు నెలల తర్వాత పబ్లిక్ ఆక్షన్ వేయాల్సి వుంటుంది. ఆక్షన్ తాలూకు వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు. అయితే, వాహన యజమానులకు ఇంకొన్ని రోజులు సమయం వుందని అధికారులు అంటున్నారు. జరీమానా చెల్లించి వాహనాలు తీసుకెళ్ళొచ్చు. కొద్ది రోజుల క్రితం రస్ అల్ ఖైమా పోలీసులు, 1,518 వాహనాల్ని ఇంపౌండ్ చేసినట్లు వెల్లడించిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం