ఒమన్‌లో 40 డెంగ్యూ ఫీవర్‌ కేసుల నమోదు

- January 07, 2019 , by Maagulf
ఒమన్‌లో 40 డెంగ్యూ ఫీవర్‌ కేసుల నమోదు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ - డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డాక్టర& సైఫ్‌ అల్‌ అబ్రి మాట్లాడుతూ, డెంగ్యూ కేసులు 40 వరకు నమోదయినట్లు చెప్పారు. డెంగ్యూ ప్రమాదకరమైనది కావడంతో, తగిన చర్యలు చేపట్టామనీ, యాంటీ మస్క్యిటో క్యాంపెయిన్‌ మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలో జరుగుతోందని తెలిపారాయన. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, జనవరి 8 నుంచి 21 వరకు మస్కట్‌ వ్యాప్తంగా డెంగ్యూ కారక దోమల నివారణ కోసం కఠినమైన చర్యలు చేపట్టేందుకు భారీ క్యాంపెయిన్‌ని చేపడుతోంది. రోజుకి 4,200 ఇళ్ళ చొప్పున దోమల నివారణ కోసం చర్యల్ని ఈ క్యాంపెయిన్‌లో చేపడతారు. సీబ్‌, బౌషర్‌, ముట్రా ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com