ట్రైలర్ టాక్ : యాత్ర
- January 07, 2019
దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర మూవీ రూపొందింది. ఆనందో బ్రహ్మ వంటి సక్సెస్ ఫుల్ మూవీ దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి YSR పాత్రలో నటించిన యాత్ర మూవీ ఫిబ్రవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్న సన్నివేశాలు, డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. ఈ సమాజంలో అన్నింటికన్నా పెద్ద జబ్బు పేదరికం అనే డైలాగ్ జనాల మనసులను తాకేలా ఉంది. ట్రైలర్‌ను గమనిస్తే వైఎస్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోశారు. ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్న ఓ రైతు వైఎస్‌తో ఏదో చెప్పాలనుకోవడం, డాక్టర్లు అతను మాట్లాడలేడని చెప్పిన అనంతరం 'నాకు వినపడుతుందయ్యా' అని వైఎస్ గా మమ్ముట్టీ పలికిన డైలాగులు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. చివర్లో ఓ వ్యక్తి రాజశేఖర ఈ సారి నా ఓటు నీకే.. నీ పార్టీకి కాదు అని పలికిన డైలాగ్ ఆకర్షించేదిగా ఉంది.. ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది.
70ఎమ్ ఎమ్ బ్యానర్ పై శివ మేక సమర్పణ లో విజయ్ చిల్ల, శశిదేవ రెడ్డి నిర్మించిన యాత్ర మూవీ కి K సంగీతం అందించారు. జగపతి బాబు, రావు రమేష్, పోసాని, సుహాసిని, అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. యాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు K స్వరపరిచిన, సమర శంఖం, రాజన్న నిన్నాపగలరా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాత్ర మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. యాత్ర మూవీ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండి, మూవీ పై అంచనాలను పెంచేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







