సన్మానాలు

- December 25, 2015 , by Maagulf


సన్మానాలు ...అంటే నాకిష్టం లేదని నిరాడంబరుడిని అని చెప్పను .ఎందుకు బావుండదు సన్మానం.అందరు మనని పొగుడుతూ ఉంటే ... ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మనం...చేయించుకుంటే ...పూల దండలు ప్రశంసలు గజమాలలు ఓహ్ . ఎటు తిరిగి మనకి చేసే వాళ్ళే లేరు కాని...
ఇప్పటికి అప్పటికి నాకు ఏదో మందిరం లో సన్మానం జరుగుతుంది అని ఆశ లేదు...ఎందుకు నాలుగు సీరియళ్ళు 20 కథలు రాసినందుకా? 
కాని ...ఆయన పొడుగ్గా బలహీనం గా హుందా గా ఉండె వారు అస్తమా తో బాధ పడే వారు చాలా సంవత్సరాలు ఆయన కి ట్రీట్మెంట్ చేసే వాడిని.ఒక సారి మాటల సందర్భం లో ఆయనే పోలి విజయరాఘవరెడ్డి గారు గొప్ప హిందీ స్కాలర్ హిందీ మహా విద్యాలయ డైరెక్టర్ అని చెప్పారు.ఆ తరవాత ఆయన ఎంత గోప్పవారో తెలిసి తెలుగు కథలు ఎన్ని హిందీ లోకి అనువాదం చేసి మన సాహిత్యానికి సేవ చేసారో తెలిసి ఆశ్చర్యపోయాను.ఒక సారి సంకోచం గానే అడిగాను సార్ నా నవల ఏదైనా హిందీ లోకి... అనువాదం చేయగలరా...సరే అన్నారు కాని ఆయన కి టైం లేక పోవడమో నా నవలలు నచ్చక పోవడమో అలా జరగ లేదు .
ఒక రోజు కారు లో ఒక సంచి రెండు హిందీ పుస్తకాలతో క్లినిక్ కి వచ్చారు.మీ కథ "నీలాంటి నువ్వు " చాలా బావుందండీ అనువాదం చేసి సంకలనం లో వేసాను అన్నారు.నా ఆనందానికి అవధులు లేవు.ఇలా కూర్చోండి అన్నారు .కుర్చీలో కూర్చున్నాను .శాలువా తీసి భుజాల మీద కప్పారు .మీ లోని రచయిత కు ఇది నా గౌరవం ...ఈ రోజు నేను పేషెంట్ గా రాలేదు అన్నారు.గిర గిరా తిరిగే ఫానులు గోడల మీద రెప రెప లాడె కాలెండర్లు నిశబ్దం గా హర్ష ధ్వానాలు చేసాయి .నా కళ్ళు నీళ్ళు తిరిగాయి .అంత మంది గొప్ప కథకుల మధ్య నాపేరు.!..ఆ శాలువా ఇప్పటికి భద్రం గా దాచుకున్నాను.అదే నాకు జరిగిన సన్మానం .అంతే 
హృదయపూర్వకం గా గొప్ప మనీషి చేసే సన్మానమే అది .ఆ తరవాత ఆయన ఎన్నో ఆరోగ్య సమస్యల తో బాధ పడ్డారు కాపాడ లేక పోయాను.ఆయన శ్రీ పోలి విజయరాఘవ రెడ్డి.

 

--డా. మధు చిత్తర్వు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com