సంక్రాంతి ఎఫెక్ట్:ఆకాశాన్నంటుతున్న విమాన టిక్కెట్ల ధరలు
- January 09, 2019
హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా విమానాయాన సంస్థలు ధరలను భారీగా పెంచాయి. పది రెట్లు ధరలను పెంచాయి. బస్సులు, రైళ్లలో సీట్లు దొరకాలంటే కనీసం మూడు మాసాల పాటు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విమానాల వైపు చూస్తున్న ప్రయాణీకుల జేబులు చిల్లులు పడాల్సి వస్తోంది.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వగ్రామాలకు విమానంలో వెళ్లాలంటే తమ ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా పెద్ద ఎత్తున విమానాయాన సంస్థలను ఛార్జీలను పెంచేశాయి.
ఈ నెల 10,11 తేదీల్లో ఈ ఛార్జీలు మరింత ఎక్కువగా పెంచారు. సాధారణ రోజుల్లో హైద్రాబాద్ నుండి రాజమండ్రి వరకు సుమారు. రూ.3వేలు వసూలు చేస్తారు. సాధారణ రోజుల్లో మరింత డిమాండ్ ఉంటే రూ.5వేలు వసూలు చేసేవారు. కానీ, పండుగ రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నందున 10 రెట్లు చార్జీలను పెంచేశారు. హైద్రాబాద్ నుండి రాజమండ్రికి ఒక్కరికి రూ. 20 వేలు వసూలు చేస్తున్నారు.హైద్రాబాద్ నుండి విజయవాడకు రూ.50వేలు, హైద్రాబాద్ నుండి విశాఖపట్టణానికి రూ.40వేలుగా నిర్ణయించారు.
ఈ నెల 17,18 తేదీల్లో ఈ ఛార్జీలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే బస్సులు, రైళ్లలో టిక్కెట్టు దొరికని వారు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ విపరీతంగా ఛార్జీలు పెంచడంతో విమానాలపై దృష్టి పెట్టారు. అయితే ఈ డిమాండ్ కారణంగా విమానాయాన సంస్థలు కూడ భారీగా ఛార్జీలను పెంచేశాయి.
తాజా వార్తలు
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







