'బైలంపుడి' లిరికల్ సాంగ్ లాంచ్‌

'బైలంపుడి' లిరికల్ సాంగ్ లాంచ్‌

తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'బైలంపుడి'. హరీష్‌ వినయ్‌, తనిష్క తివారి జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి అనిల్‌ పిజి రాజ్‌ దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం లిరికల్ సాంగ్ బుధవారం హైదరాబాద్‌లోని ఫిలించాంబర్ లో బాలీవుడ్ హీరోయిన్ మైరా అమిథి చేతుల మీదుగా లాంచ్ చేశారు. అనంతరం మైరా అమిథి మాట్లాడుతూ."పిల్లల దేవుడు` పల్లవితో సాగే సాంగ్ చాలా బావుంది. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు" అన్నారు.
నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.''పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా 'బైలంపుడి' చిత్రాన్ని నిర్మిస్తున్నా. అందరూ కొత్తవారైనప్పటికీ ఎంతో సహజసిద్ధంగా నటించారు. షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమాని తెరకెక్కించాము. `ఇక్కడ యుద్ధం చేయాలి.గెలవడానికి కాదు, బతకాడినికి" అనేది మా సినిమా క్యాప్షన్. "పిల్లల దేవుడు` అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశాం. అందరికీ పాట నచ్చుతుందన్న నమ్మకం ఉంది" అన్నారు.
సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ." ఇందులో రెండు పాటలున్నాయి. ఈ రోజు పిల్లల దేవుడు అనే పాట లాంచ్ చేశాం. పాట అందరికీ నచ్చుతుంద`న్నారు.
హీరో హరీష్ వినయ్ మాట్లాడుతూ."సుభాష్ గారు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీసారు` అన్నారు.
లిరిక్ రైటర్ రామారావు మాట్లాడుతూ." దర్శక నిర్మాత ఇచ్చిన స్వేచ్ఛతో మంచి సాహిత్యాన్ని అందించగలిగాను. సుభాష్ గారు అద్భుతమైన ట్యూన్ ఇచ్చార"న్నారు.
దర్శకుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ." కెమెరామేన్ గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. చాలా చిత్రాలకు వర్క్ చేశాను. దర్శకుడుగా ఇది తొలి సినిమా. `బైలంపుడి` అనే గ్రామంలో జరిగే లవ్ అండ్ పొలిటికల్ చిత్రమిది. ప్రతి పాత్ర ఎంతో సహజ సిద్ధంగా ఉంటుంది. ఒక విలేజ్ లో ఏమైతే అంశాలు ఉంటాయో.మా సినిమాలో కూడా అన్ని అంశాలుంటాయి. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రస్తుతం కొత్త కథలను ఆదరిస్తున్నారు. ఆ తరహాలో వచ్చే మా సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా" అన్నారు.
హరీష్‌ వినయ్‌, తనిష్క తివారి, బ్రహ్మానంద రెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్‌, నటరాజ్‌, నరి, నాగార్జున, సెబాస్టియన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, డైలాగ్స్‌: సాయి, ఎడిటర్‌: జానకిరామ్‌, ఫైట్స్‌: కృష్ణం రాజ్‌, ఆర్ట్‌: ఉత్తమ్‌కుమార్‌, డాన్స్‌: ఘోరా, లిరిక్స్‌: రామారావు, పిఆర్వో: వంగాల కుమారస్వామి, నిర్మాత: బ్రహ్మానందరెడ్డి, సినిమాటోగ్రాఫర్‌-స్టోరి-స్క్రీన్‌ప్లే-డైరక్షన్‌: అనిల్ పిజి రాజ్‌.

Back to Top