ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి, నలుగురికి గాయాలు
- January 12, 2019
యూ.ఏ.ఈ:రోడ్డు మీద వెళుతున్న వాహనం ప్రమాదానికి గురవగా, మంటలు వ్యాపించి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఎమిరేట్స్ రోడ్డుపై మధ్యాహ్నం 1.45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి చెందిన అధికారులు ప్రమాదానికి గురయ్యారు. కాంక్రీట్ బ్యారియర్ని అతి వేగంతో కారు ఢీకొంది. ఆ తర్వాత కారు బోల్తా కొట్టింది. మంటలు వ్యాపించగా, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మిగతావారిని ఆసుపత్రికి తరలించారు. అల్ కాసిమి హాస్పిటల్లో వీరికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. వాహనదారులు రోడ్లపై అప్రమత్తంగా వుండాలనీ, అతి వేగం ప్రమాదాలకు ముఖ్య కారణమని షార్జా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఖాలిద్ మొహమ్మద్ అల్కే చెప్పారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







