తెలుగు తరంగిణి రస్ అల్ ఖైమా వారి సంక్రాంతి సంబరాలు
- January 14, 2019_1547493273.jpg)
రస్ అల్ ఖైమా:తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో యు.ఎ.ఇ లోని రస్ అల్ ఖైమా నగరంలోని సుడానీస్ క్లబ్ లో సంక్రాంతి సంబరాలు అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. శ్రీమతి శాంతి, లలిత, సౌజన్య గార్ల ప్రార్ధనలతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
ఉదయం భోగి మంటల అనంతరం, సంప్రదాయం దుబాయి వారి సహకారం తో తిరుపతి వేదిక్ యూనివర్సిటీ నుండి వచ్చిన శ్రీనివాస్ , ధర్మరాజు నిర్వహించిన శ్రీ గోదా రంగనాధుల కళ్యాణ మహోత్సవం ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండుగగా కొనసాగింది. కళ్యాణ మహోత్సవంలో శ్రీలలిత,ఇందిరా బృందం అన్నమయ్య కీర్తనలు, వాణిశ్రీ, కుమారి శ్రావణి ల కూచిపూడి నృత్యాలు,సామూహిక విష్ణు సహస్ర నామార్చన, తిరుప్పావై, సాతుమరై అందరినీ ఆకట్టుకున్నాయి.
చిరంజీవులు మిహిర్, చరణ్, కార్తీక్ ల హరిదాసుల సందడి, రంగవల్లుల పోటి, గొబ్బెమ్మలు, భోగి పళ్లు,బొమ్మల కొలువు, ఇస్కాన్ చిన్నారుల బృదం చేసిన గోదాకళ్యాణ నృత్య రూపకం, దశావతార స్తోత్రం, నిహారికల నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. కమ్మని విందు భోజనాలతో, ఆట పాటలతో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో, పల్లెలలోని సంక్రాంతిని సుదూరతీరాలలో ఉన్న రస్ అల్ ఖైమా నగరం లోని సుమారు 1000 మంది తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
తెలుగు తరంగిణి అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన తరంగిణి సభ్యులు అందరు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. తెలుగు తరంగిణి సభ్యులు సుజన్, మైథిలి ఏంకర్లుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..