గన్నవరం నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసు:ఏపీఏడీసీఎల్
- January 14, 2019
అమరావతి:గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు నేరుగా విమానాన్ని నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) ప్రజాభిప్రాయానికి ఇటీవల శ్రీకారం చుట్టింది. సింగపూర్‌కు విమాన సర్వీస్ ప్రవేశపెట్టే ముందు కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. అప్పట్లో 60 వేల మందికిపైగా ఆన్‌లైన్‌లో సానుకూలతను వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి లోటు భర్తీ నిధి (వీజీఎఫ్) సమకూర్చే అవకాశం లేకుండానే గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడుస్తోంది. దుబాయ్‌కు ప్రవేశపెట్టే సర్వీసుపైనా ఆన్‌లైన్‌లో 55వేల మందికిపైగా అనుకూలతను వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి దుబాయ్ వెళ్లే వారు హైదరాబాద్ వెళ్లి ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చాక ఇక్కడి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. సింగపూర్ విమాన సర్వీసు విజయవంతం కావడంతో ఇప్పుడు దుబాయ్ కోసం ఏపీఏడీసీఎల్ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల నుంచి అనతి కాలంలో మంచి స్పందన రావడంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. లోటు భర్తీ నిధి విధానంలో గన్నవరం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడిపేందుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ నెలాఖరులో విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలవనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..