ఒరిజినల్ ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలంటే..

- January 22, 2019 , by Maagulf
ఒరిజినల్ ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలంటే..

అన్నింటికీ ఆధార్ కార్డ్ తప్పనిసరి అయిపోయింది. ఆ ఒక్కటి ఉంటే చాలు చాలా పన్లు అయిపోతున్నాయి. మరి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తే.. కొద్ది రోజుల తరువాత మీ సేవా కేంద్రాలకో, ఆధార్ కేంద్రాలకో వెళ్లి కొత్త ఆధార కార్డు తీసుకుంటున్నారు.
 
అయితే ఇవి అంత క్వాలిటీగా ఉండడం లేదు. అయితే ఇక నుంచి ఒరిజినల్ కార్డులను నేరుగా విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నుంచే పొందవచ్చు. అయితే ఆయా కేంద్రాల్లో తీసుకున్న ఆధార్ కార్డులు చెల్లుబాటు అవుతున్నా భద్రత కారణాల రీత్యా ఒరిజినల్ ఆధార్ కార్డులను అందించే దిశగా యూఐడీఏఐ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది.

మరి ఈ ఒరిజినల్ ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకునే విధానం..
resident.uidai.gov.in/aadhaarreprint వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. 
తర్వాత అక్షరాలు, అంకెలు గల సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. 
మీకు ఎంఆధార్ యాప్ ఉంటే అందులో ‘i have totp’ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 
టీవోటీపీ లేకపోతే ‘రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ’ బటన్‌పై క్లిక్ చేయాలి. 
ఆధార్‌తో రిజిస్టర్ అయిన నంబరుకు వచ్చిన ఓటీపీని సంబంధిత బాక్సులో ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. 
తర్వాత రూ.50 కట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును మీ అడ్రస్‌కు యూఐడీఏఐ పోస్టులో పంపుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com