అగ్నిప్రమాదం: 11 మంది నావికులు మృతి
- January 22, 2019
మాస్కో: సముద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది నావికులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన రష్యా ప్రదేశిక సముద్ర జలాల్లోని క్రెచ్ ైస్ట్రెట్ జలసంధిలో చోటుచేసుకుంది. ఒక షిప్‌లోని లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను మరొక షిప్‌లోని ట్యాంకర్‌లోకి మార్పిడి చేస్తుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక షిప్‌లో 17 క్రూ మెంబర్స్ ఉండగా.. వీరిలో తొమ్మిది మంది టర్కిష్ జాతీయులు, ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు. మరొక షిప్‌లో 15 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఏడుగురు టర్కిష్ జాతీయులు కాగా ఏడుగురు భారతీయులు. 11 మంది నావికులు సంఘటనా స్థలంలోనే చనిపోగా తొమ్మిది మంది ఆచూకీ తెలియకుండా పోయింది. మరో 12 మందిని ఇప్పటివరకు రక్షించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..