వరుస బాంబు పేలుళ్లు..నలుగురు పోలీసులు మృతి

- January 27, 2019 , by Maagulf
వరుస బాంబు పేలుళ్లు..నలుగురు పోలీసులు మృతి

సమర్రా: ఇరాక్ లోని అల్ షర్కత్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో నలుగురు ఇరాక్ పోలీసులు మృతి చెందారు. ఉదయం 8 గంటలకు అల్ షర్కత్ జిల్లా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఓ బాంబు పేలింది. ఈ పేలుడులో ఇద్దరు పోలీస్ అధికారులు మృతి చెందగా..మరో 8 మంది పోలీసులు గాయపడ్డారు. గంట వ్యవధిలోనే రెండోసారి బాంబు పేలింది. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు చనిపోగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయని పట్టణ మేయర్ అలీ దోఢా తెలిపారు.

బాగ్దాద్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ షర్కత్ 2017వరకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆధీనంలో ఉండేది. అయితే ఇరాక్ ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటినుంచి ఐఎస్ ఉగ్రవాదులు విధ్వంసాన్ని సృష్టించడం, అధికారులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com