ఘోర విమాన ప్రమాదం.. 51 మంది ప్రాణాలు తీసిన సిగరెట్..

- January 28, 2019 , by Maagulf
ఘోర విమాన ప్రమాదం.. 51 మంది ప్రాణాలు తీసిన సిగరెట్..

వరో చేసిన పొరపాటుకి మరెవరో బలవడం అంటే ఇదేనేమో. వందల మంది ప్రయాణీకులను గమ్యస్థానం చేరవేసే వాహనాల్లో ప్రధాన పాత్ర ధారి వాహనం నడిపే వ్యక్తి. అతడి మీద భరోసాతో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ నిద్రలోకి జారుకుంటారు ప్రయాణీకులు.

విమానం నడిపే పైలెట్ నిర్లక్ష్యం కారణంగా 51 మంది ప్రయాణీకులు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఈ ఘటన గత ఏడాది మార్చిలో నేపాల్‌లో జరిగింది. దర్యాప్తు అనంతరం ప్రమాదానికి కారణం వెలుగు చూసింది. విమానం నడుపుతున్న పైలెట్ కాక్‌పిట్‌లో సిగరెట్ తాగడమే ఇంత మంది బలవడానికి కారణమైంది.

యూఎస్ బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్ యూబీజీ-211 విమానాన్ని గత ఏడాది మార్చి 12 న నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి విమానంలో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 67 మంది ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు కాక్‌పిట్‌లోని వాయిస్ రికార్డ్‌ని పరిశీలించింది.

నిబంధనలకు విరుద్ధంగా పైలెట్ కాక్‌పిట్‌లోనే పొగ తాగడంతో ల్యాండింగ్ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోయాడని తెలుసుకున్నారు. పైలెట్ సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగి ఇంత మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ప్రయాణీకులతో పాటు పైలెట్‌కూడా దుర్మరణం పాలయ్యాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com