బడ్జెట్ లో ప్రతిపాదన: బంగారం పై ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్

- January 30, 2019 , by Maagulf
బడ్జెట్ లో ప్రతిపాదన: బంగారం పై ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇందులో బంగారానికి ప్రోత్సాహం లభిస్తుందా? లేదా? వేచిచూడాలి. ప్రోత్సాహకరంగా ఉంటుందని అటు వ్యాపారులు..ఇటు వినియోగదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు..జీఎస్‌టీ కారణంతో ఇప్పటికే ఎఫెక్ట్ ఉందనీ..దాన్ని ఈనాటికీ ఆ సమస్యలను ఎదుర్కొంటున్నామని బంగారం వ్యాపారస్తులు వాపోతున్నారు. ఆ ప్రభావం కొనుగోలుదారులపై కూడా పడుతుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి బడ్జెట్‌లో బంగారంపై ఉన్న 10 శాతం దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని..కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను రత్నాభరణాల పరిశ్రమ కోరింది.

వజ్రాలు, రత్నాలపై ప్రస్తుతమున్న 7.5 శాతం పన్నును 2.5 శాతానికి తగ్గించాలని...వీటికి అదనంగా అప్పు నిబంధనలను కూడా సరళతరం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో రత్నాభరణాల పరిశ్రమ పేర్కొంది. రూ.2 లక్షలు గానీ అంతకుమించిగానీ..బంగారు ఆభరణాల కొనుగోలు చేస్తే..పాన్‌ నంబర్‌ ఇవ్వాలనే రూల్ ను కూడా సడలించాలని..దాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కోరింది. ఈ క్రమంలో దేశంలో 50 శాతం మందికి పాన్‌ కార్డులే లేవనీ..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారికి పాన్ కార్డ్ రూల్ అనేది చాలా ఇబ్బందిగా మారిందని తెలిపింది. రత్నాభరణాల ఎగుమతులకు సంబంధించి తీసుకునే రుణాలపై 5 శాతం వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలని కోరింది. మరోవైపు బంగారంపై అధిక దిగుమతి ట్యాక్స్ కారణంగా బంగారం అక్రమ రవాణా పెరిగేందుకు అవకాశముందని..కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను రత్నాభరణాల పరిశ్రమ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com