రోడ్‌ క్లోజర్‌ అలర్ట్‌: వీకెండ్‌లో ఈ రోడ్ల మూసివేత

- January 31, 2019 , by Maagulf
రోడ్‌ క్లోజర్‌ అలర్ట్‌: వీకెండ్‌లో ఈ రోడ్ల మూసివేత

అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ రోడ్‌పై తాత్కాలిక పాక్షిక మూసివేతను ప్రకటించింది. గ్వీఫాత్‌ వైపు ఇ11 రోడ్డును ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 3 వరకు మూసివేస్తారు. అల్‌ జహియాహ్‌ ప్రాంతంలో అల్‌ ఫిర్దౌస్‌ స్ట్రీట్‌ని ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 2 వరకు మూసివేయడం జరుగుతుంది. సోషల్‌ మీడియా వేదికగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఈ మూసివేతలకు సంబంధించిన మ్యాప్‌లను కూడా పోస్ట్‌ చేయడం జరిగింది. వాహనదారులు ఈ మూసివేతల్ని పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ వాహనాలు నడపాలని అధికారులు సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com