ట్రక్కుని ఢీకొన్న కారు: 39 ఏళ్ళ ఎమిరాతి మృతి
- January 31, 2019
4 వీల్ డ్రైవ్ వాహనం, ట్రక్కుని ఢీకొనడంతో 39 ఏళ్ళ ఎమిరేటీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. షార్జాలోని అల్ ధయిద్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్స్ ఓన్లీ లేన్‌పై ఎమిరాతి తన వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకోగానే, పెట్రోల్ సిబ్బంది, అంబులెన్స్, పారామెడిక్స్ సంఘటనా స్థలానికి వెళ్ళాయనీ, అయితే ఎమిరాతి అక్కడికక్కడే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు. అతి వేగం, అప్రమత్తంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. అల్ ధయిద్ ఆసుపత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదం కారణంగా తీవ్రగాయాలై బ్రెయిన్‌లో అంతర్గత రక్త స్రావంతో ఎమిరాతి మృతి చెందినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..