అమెరికా:మైనస్ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు..

- February 01, 2019 , by Maagulf
అమెరికా:మైనస్ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు..

అమెరికాను తీవ్రమైన చలి చంపేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనివిని ఎరుగని విధంగా దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ఒకానొక దశలో మైనస్ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు మరింత పడిపోతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీనికారణంగా నదులు, సరస్సులు,జలపాతాలు గడ్డకట్టుకుపోయాయి. రోడ్లు, ఇళ్లపై భారీగా మంచుపేరుకుపోయి నిర్మానుష్యంగా మారింది.


 
అమెరికాలో సాధారణంగా చలి ఎక్కువగా ఉంటుంది. ఏడాదిలో సగానికంటే ఎక్కువ కాలం చలే. కానీ పోలార్ వోర్టెక్స్ కారణంగా ఉత్తర దృవం నుంచి వీస్తున్న గాలులతో దేశంలోని పశ్చిమ మధ్య ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. చలిగాలు కారణంగా ఇప్పటివరకు12 మంది మరణించినట్లు వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 40 నగరాల్లో ఇదివరకు ఎప్పుడు లేనివిధంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మిన్నెసోటాలో ని థిఫ్ రివర్ ఫాల్స్ లో మంగళవారం రికార్డు స్థాయిలో మైనస్ 77 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇట్టిపరిస్థితుల్లో ఇళ్లనుంచి బయటకు వస్తే… 5నుంచి 10 నిమిషాల్లోనే మానవుల మెదడు అచేతన స్థాయికి చేరిపోతుందని అధికారులు హెచ్చరించారు.


అత్యంత ప్రమాదకర స్థితిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఇల్లినాయిస్, మిచిగాన్, విస్కాన్సిస్ రాష్ట్రాల్లో గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో ఇళ్లనుంచి బయటకు రాకూడదని హెచ్చరికలను జారీచేశారు. చికాగోలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీలు గా నమోదైంది. అంతర్జాతీయ వాటర్ ఫాల్, మిన్నెసోటాలో మైనస్ 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విస్కాన్సిస్ లో మైన్ 28, సౌత్ డకోటాలో మైనస్ 23, నార్త్ డకోటా, న్యూయార్క్ లో మైనస్ 30, మిచిగాన్ లోని సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయింది.

అతిశీతల వాతావరణం కారణంగా పలు రాష్ట్రాల్లో కార్యాలయాలు, విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. రోడ్డు, రైలు మార్గాలతోపాటు న్యూయార్క్, పెన్సిల్వేనియా లోని విమానాశ్రయాలు మూతపడ్డాయి. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇల్లినాయిస్ లో మైనస్ టెంఫరేచర్ వాతావరణంలో మంచులో చిక్కుకుపోయిన బస్సులోని 21మంది ప్రయాణీకులను పోలీసులు అతికష్టం మీద రక్షించారు. డెట్రాయిట్ లోని ఓ వీధిలో చలికి మరణించిన 70 ఏళ్ల వృద్దుడి మృతదేహాన్ని కనుగొన్నారు. అలాగే హైవా యూనివర్సిటీలోని భవనం ఆరుబయట విద్యార్ధి డెడ్ బాడీని గుర్తించారు.

అమెరికాలని పశ్చిమ మద్య ప్రాంతంలో ఎక్కడచూసినా కొండల్లా పేరుకుపోయిన మంచే కనిపిస్తోంది. ఇళ్లు,రోడ్లు అన్ని పూర్తిగా మంచుతో కప్పబడి పోయాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో రవాణా నిలిచిపోయింది. చికాగోలో గతంలోనమోదైన రికార్డును అధిగమించి మైనస్ 27 డిగ్రీలు నమోదైంది. 1985 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇప్పుడేనని అధికారులు అంటున్నారు. పోలార్ వోల్టెక్స్ ప్రభావంతో ఉత్తర దృవం నుంచి చలిగాలులు వీస్తున్నాయని, వీటిప్రభావం మరి రెండుమూడు రోజుల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com