గర్ల్స్ స్కూల్‌లో స్టౌ పేలడంతో భయాందోళనలు
- February 01, 2019
రస్ అల్ ఖైమాలోని ఓ గర్ల్స్ స్కూల్‌లో స్టౌ పేలడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రస్ అల్ ఖైమా పోలీసులు మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్, పరిస్థితిని హుటాహుటిన అదుపులోకి తీసుకురావడం జరిగింది. గాయపడ్డ కొందరు విద్యార్థినులకు తక్షణ వైద్య సహాయం అందించి, ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థుల్ని తమ తమ ఇళ్ళకు పంపించివేశారు. అల్ ధయిత్ సెకెండరీ స్కూల్ ఫర్ గర్ల్స్‌లో ఓ పార్టీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. అధికారులు ఘటన జరిగిన వైనంపై ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..