ఎన్నికల వేళాయెరా..వాట్సాప్ వార్నింగ్!
- February 07, 2019
న్యూఢిల్లీ: పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ దేశంలోని రాజకీయ పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ యాప్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో వాట్సాప్ రంగంలోకి దిగింది. ఇప్పటికే పార్టీలు తమ యాప్‌ను దుర్వినియోగం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి అలా చేస్తే సదరు అకౌంట్లను నిషేధిస్తామని హెచ్చరించింది. చాలా వరకు రాజకీయ పార్టీలు మా యాప్‌ను ఎలా వాడాలో అలా వాడటం లేదు. మా ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఇలా చేస్తే వాటిని నిషేధించాల్సి ఉంటుంది అని వాట్సాప్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ వెల్లడించారు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వాట్సాప్ దుర్వినియోగం జరగకుండా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. చట్ట విరుద్ధమైన ఎలాంటి సమాచారమైనా తమ యాప్స్ ద్వారా వ్యాప్తి చెందకుండా అన్ని సంస్థలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. వాట్సాప్ అనేది ప్రైవేట్ కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే అని, అసహజ సందేశాలు పంపించే నంబర్లను నిషేధించినట్లు కార్ల్ వూగ్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







