స్పోర్ట్స్ డ్రామా లో ఇలయదళపతి విజయ్

- February 07, 2019 , by Maagulf
స్పోర్ట్స్ డ్రామా లో ఇలయదళపతి విజయ్

ఇలయదళపతి విజయ్ రీసెంట్‌గా నటించిన చిత్రం సర్కార్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఇటీవలే చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీస్ లఘాన్, పీలే చిత్ర తరహాలో ఉంటాయని అంటున్నారు. ఇందులో విజయ్ పాత్ర పేరు మైఖేల్ అని తెలుస్తుంది. నయన తార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. యువ హీరో కథిర్, యోగిబాబు, వివేక్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదలకానుంది. విజయ్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన తెరి, మెర్సల్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో విజయ్ 63వ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com