రాహుల్ పై బయోపిక్..'మై నేమ్ ఈజ్ రాగా'..

- February 10, 2019 , by Maagulf
రాహుల్ పై బయోపిక్..'మై నేమ్ ఈజ్ రాగా'..

పొలిటికల్ బయోపిక్‌లలో మరో తాజా బయోపిక్ రాబోతోంది. 'మై నేమ్ ఈజ్ రాగా' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపనున్నారు. దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్ కూడా అయిన రూపేష్ పాల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ టీజర్ విడుదలయింది. ఇది ఒకవిధంగా రాహుల్ బయోపిక్ అనడం కన్నా రాజకీయంగా తనకు ఎదురైనా దాడులను, ఆటుపోట్లను ఎదుర్కొన్న ఓ వ్యక్తి కథ అని రూపేష్ పాల్ అంటున్నారు. ఓటమిని, వైఫల్యాలను నిర్భయంగా ఫేస్ చేసిన ఏ వ్యక్తి అయినా ఈ కథను తనకు అన్వయించుకోవచ్చునని ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమాకు సంబంధించి యూఎస్, ఇటలీలో కొన్ని కీలక సన్నివేశాలను కొంతవరకు షూట్ చేశారు. ఇందులో రాహుల్ కుటుంబానికి చెందిన సభ్యుల పాత్రధారులను కూడా చూపడం విశేషం. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వచ్చే ఏప్రిల్ నెలలో ఈ బయో పిక్ విడుదల చేయాలనుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com