సౌందర్య ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక
- February 10, 2019
తలైవా ఇంట పెళ్లి బజాలు మోగుతున్నాయి. రజనీకాంత్ కుమార్తె సౌందర్య, నటుడు విశాకన్ వనగమూడికు ఈ నెల 11న చెన్నైలో పెళ్లి జరగనుంది. ఈ సందర్భంగా శనివారం ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ సంగీత్ కార్యక్రరమంలో సూపర్‌స్టార్ రజనీ ‘ముత్తు’ మూవీలోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు’ పాటకు స్టెప్పులు వేశారు. ఇక ఈ వేడుకలో మ్యూజిక్ దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సందడి చేశారు. అటు తలైవా డ్యాన్స్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.
ఇక వధువు సౌందర్య చెప్పలేనంత సంతోషంగా ఉందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘నా జీవితంలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు.. నాన్న రజనీ, కొడుకు వేద్, ఇప్పుడు విషగన్’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







