ఢిల్లీ లో ముగిసిన చంద్రబాబు ధర్మపోరాట దీక్ష
- February 11, 2019
ఢిల్లీ:ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ముగిసింది. విభజన హామీలు నెరవేర్చాలంటూ దిల్లీలో తెదేపా అధినేత ఈ దీక్ష చేపట్టారు. మాజీ ప్రధాని దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు. వివిధ జాతీయ పార్టీల నేతలు వచ్చి చంద్రబాబు దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించారు.ఈ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు దీక్ష కొనసాగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ములాయం సింగ్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ధర్మపోరాట దీక్ష మద్దతు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







