యజమాని కారు దహనం కేసులో మెయిడ్‌పై విచారణ

- February 13, 2019 , by Maagulf
యజమాని కారు దహనం కేసులో మెయిడ్‌పై విచారణ

యూ.ఏ.ఈ:తన యజమాని కారుని దహనం చేసిన కేసులో మెయిడ్‌ విచారణను ఎదుర్కొంటోంది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు, మెయిడ్‌ని అరెస్ట్‌ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో మెయిడ్‌, కారుని గ్యాసోలైన్‌తో తగలబెట్టింది. కారు తగలబడుతుండడాన్ని గమనించిన యజమాని వెంటనే సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బందికి సమాచారం తెలుపగా, వెంటనే రంగంలోకి దిగిన సివిల్‌ డిఫెన్స్‌ మంటల్ని ఆర్పివేశారు. అయితే తన మీద వస్తున్న ఆరోపణల్ని మెయిడ్‌ ఖండిస్తోంది. మంటల్ని ఆర్పివేసేందుకు తాను ప్రయత్నించానని, ఆ మంటలు ఎలా వ్యాపించాయో తనకు తెలియదని అంటోందామె. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా పడింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com