హార్ట్ ఫెయిల్యూర్: ఇండియన్ స్కూల్ మాబెలా విద్యార్థిని మృతి
- February 13, 2019
మస్కట్: 10 ఏళ్ళ ఇండియన్ గర్ల్, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు ఎంతలా ప్రయత్నించినా ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయారు. ఫిబ్రవరి 7న ఈ ఘటన చోటు చేసుకుంది. పుట్టుకతోనే చిన్నారి గుండెలో రెండు రంధ్రాల్ని గుర్తించారు వైద్యులు. ఆ తర్వాత ఆమెకు వైద్య చికిత్స అందించారు. 2008 సెప్టెంబర్ 22న జన్మించిన అయేషా, ఆ తర్వాత అప్పుడప్పుడూ ఛాతి నొప్పితో బాధపడుతూ వచ్చేది. కాగా, వున్నపళంగా ఛాతీ నొప్పి అధికం కావడంతో ఆమెను సమీపంలోని ఆసుపరతికి తరలించారు. అయితే వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విద్యార్థిని మృతి పట్ల ఇండియన్ స్కూల్ అల్ మాబెలా యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. తన కుమార్తెలా ఎవరూ అర్థాంతరంగా తనువు చాలించకూడదనీ, పుట్టకతో వచ్చే అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా వుండాలని బాధిత చిన్నారి తండ్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..