రైల్వేలో 12 వేల ఉద్యోగాలు
- February 14, 2019
హైదరాబాద్: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలామంది మక్కువ చూపుతుంటారు. అందులోనే రైల్వేలో ఉద్యోగమంటే..ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రమంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఆరు డిపార్ట్ మెంట్స్ లలో మొత్తం 12,433 ఉద్యోగాలను భర్తీ రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)ల ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న ద.మ. రైల్వే జోన్ భారతీయ రైల్వేలో సహా ఇతర జోన్లలోనూ ఎక్కువమొత్తంలో పోస్టులు ఖాళీలున్నాయి. వీటికి త్వరలో నియామకాలు చేపడతామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఖాళీలు, 2020 సంవత్సరానివి కూడా కలిపి దేశవ్యాప్తంగా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. దీంట్లో భాగంగా..ఫిబ్రవరి నెలలో దాదాపు 1.31 లక్షల ఉద్యోగాలను ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీల ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జాబితాలో ద.మ రైల్వే పరిధిలో 12వేల పైచిలుకు ఉద్యోగాలను చేర్చారు.
తాజా వార్తలు
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!







