భారత్ లో పర్యటించనున్న సౌదీ ప్రిన్స్..పెట్టుబడులపై ఆసక్తి

- February 14, 2019 , by Maagulf
భారత్ లో పర్యటించనున్న సౌదీ ప్రిన్స్..పెట్టుబడులపై ఆసక్తి

న్యూఢిల్లీ: భారత్‌కు పెట్టుబడులు పెట్టే ప్రణాళికల్లో సౌదీ అరేబియా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌నే అనుసరిస్తోంది. దుబాయి పెట్టుబడి వ్యూహాలన్నీ అబూదాబినే పోలి ఉంటున్నాయని పరిశీలకుల అంచనా. ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారత్‌ను ఈనెల 19-20తేదీల్లోపర్యటనకు వస్తున్నారు. సౌదీ అరేబియా భారత్‌కు నాలుగో అతిపెద్ద వాణిజ్యభాగస్వామిగా ఉంది. దేశంలోని ముడిచమురు అవసరాల్లో 20శాతం సౌదీనే భర్తీచేస్తోంది. అంతేకాకుంబడా భారత్‌ ప్రభుత్వం ఇంధన మంత్రిని ఎన్‌ఐఐఎఫ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు సైతం అధికారాలిచ్చింది. అబూదాబి సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ మొట్టమొదటిసారిగా ఎన్‌ఐఐఎఫ్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ గా నిలిచింది. ఎన్‌ఐఐఎఫ్‌ మాస్టర్‌ ఫండ్‌లో 2017నాటికే 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. డిపి వరల్డ్‌ లిమిటెడ్‌ దుబాయ్ కేంద్రంగా ఉన్న ఓడరేవు ఆపరేటర్‌, ఎన్‌ఐఐఎఫ్‌లు గత ఏడాది సంయుక్తంగా భారత్‌లో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులకు ముందుకువచ్చాయి. ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారత్‌ను ఈనెల 19,20తేదీల్లో పర్యటిస్తారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవలే బ్యూనస్‌ ఏరీస్‌లో గడచిన నవంబరులో పెట్టుబడుల అవకాశాలపై చర్చలుజరిపారు.

సౌదీ అరేబియా పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సాయంతో పెట్టుబడులకు సౌదీ ముందుకువస్తోంది. ఇప్పటికిప్పుడుచూస్తే ఆరామ్‌కో, ఆడ్‌నాక్‌ కంపెనీలు భారత్‌లోని రిఫైనరీలు, పెట్టుబడులు, పెట్రోకెమిల్‌ ప్రాజెక్టుల్లో సంయుక్త వెంచర్‌ల నిర్వహణకు ముందుకు వస్తున్నాయని తేలింది. వీటి విలువ కూడా సుమారు 3 బబిలియన్‌ డాలర్లకుపైబడి ఉంటుందని నిపుణుల అంచనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com