హలో ఇది విన్నారా!... ఇక నుండి రైళ్ళలో ఉచిత సినిమాల సందడి
- February 14, 2019
రైల్వే ప్రయాణికులకు శుభవార్త... ఇక నుండి రైలు ప్రయాణం మరింత సుఖవంతం కానుంది. వినోదభరితం కానుంది. దూరప్రాంతాలకు గంటలకొద్ది ప్రయాణించే ప్రయాణికులకు ఇలాంటి బోర్ కొట్టకుండా ఉచితంగా సినిమాలను చూసే అవకాశాన్ని కల్పిస్తోంది ఇండియన్ రైల్వే.
కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ ఉచిత సినిమాల మ్యాజిక్ బాక్స్
కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో ఉచిత సినిమాల మ్యాజిక్ బాక్స్
సుమారుగా మూడు వేల రైళ్లలో భారతీయ భాషల్లో ఉచితంగా సినిమాలు వీడియోలు చూసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని గతంలో భావించిన రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం పెద్ద కసరత్తే చేసింది. ఫలితంగా కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ప్రస్తుతం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా దేశంలో రైల్వే వ్యవస్థను కూడా ఆధునీక రిస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కొత్తగా మేజిక్ బాక్స్ ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించే వారికి ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తున్నారు.
ఇప్పటికే రైళ్ళలో ఫ్రీ వైఫై సదుపాయం
ఒక కాచిగూడ- కె.ఎస్.ఆర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే కాకుండా శతాబ్ది, లక్నో ఎక్స్ ప్రెస్, రాజధాని ఎక్స్ ప్రెస్ నేను సైతం ఈ ఉచిత వైఫైతో రైలు ప్రయాణికులు సినిమాలు ఉచితంగా చూడవచ్చని చెప్పారు. ప్రయాణికులకు ఆధునిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న రైల్వే అందులో భాగంగానే కాచిగూడ కేఎస్ఆర్ బెంగళూర్ ఎక్స్ ప్రెస్, శతాబ్ది, ముంబయి, రాజధాని ఎక్స్ ప్రెస్, లక్నో ఎక్స్ ప్రెస్ లలో వైఫై ఎన్ ఫోటెయిన్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశామని తెలిపింది. దాని సహాయంతో ప్రయాణికులు వ్యక్తిగత డివైజ్ లలో ఉచితంగా నచ్చిన సినిమాలను చూడవచ్చని రైల్వేశాఖ ప్రకటించింది.
చూసే కంటెంట్ లపై రైల్వే సాంకేతిక నిపుణుల నియంత్రణ
అయితే రైల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అవకాశం ఉంది కదా అని ఏది పడితే అది చూడడానికి వీలు కాదు. ఎందుకంటే వైఫై దుర్వినియోగం కాకుండా, రైలులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అశ్లీలమైన, అభ్యంతరకరమైన సినిమాలు కానీ, వీడియోలు కాని చూడకుండా కేవలం అందరూ చూడదగిన సినిమాలు మాత్రమే చూడడానికి తగిన చర్యలు తీసుకుంది. అంతేకాదు రైలులో వైఫై ఫ్రీ గా ఉందని ఎలా పడితే అలా డౌన్లోడ్ చేయడానికి కూడా వీలుకాకుండా కావలసిన సాంకేతిక చర్యలను తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతం కాచిగూడ-కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ లోని ఐదు ఏసీ బోగీల్లో ప్రయోగాత్మకంగా ఈ ఉచిత వైఫై విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో గమనించిన తర్వాత క్రమంగా మరికొన్ని రైళ్లలో వైఫై సదుపాయాన్ని కల్పించి ఫ్రీగా సినిమాలు చూసే అవకాశాన్ని కలిగించనుంది దక్షిణ మధ్య రైల్వే.
భవిష్యత్ లో రైల్వేకి ఆదాయంతో పాటు ప్రయాణికులకు వినోదం అందించే ప్లాన్
అంతేకాదు ఇప్పటికే సినిమాలు వీడియోలను చూసే సౌకర్యాన్ని అందించడం కోసం రైళ్లలో ప్రయాణికులకు సినిమాలు, వీడియోల సౌకర్యాన్ని అందించడం కోసం 24 కంపెనీలు గతంలోనే ముందుకొచ్చాయి. వారి వద్ద నుండి రైల్వే కు లైసెన్స్ ఫీజు ద్వారా 500 కోట్ల రూపాయల ఆదాయం ఒనగూరే అవకాశముంది. ఇక ఈ ప్రయోగం కోసం సర్వీస్ ప్రొవైడర్స్ గతంలోనే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. ఒకవేళ ఇది కూడా సక్సెస్ అయితే రానున్న రోజుల్లో ప్రతి బోగి లోనూ ప్రయాణికులు వినోదభరిత కార్యక్రమాలను, అలాగే సినిమాలను చూసే వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







