మహిళల రక్షణకై భారత ప్రభుత్వ చర్యల్ని ఆహ్వానించిన యూఏఈలోని భారత మహిళలు

- February 14, 2019 , by Maagulf
మహిళల రక్షణకై భారత ప్రభుత్వ చర్యల్ని ఆహ్వానించిన యూఏఈలోని భారత మహిళలు

భారత పార్లమెంటులో ఇటీవల కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రవేశపెట్టిన ప్రపోజల్‌ బిల్లుపై యూఏఈ రెసిడెంట్స్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రపోజల్‌ అమల్లోకి వస్తే, భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డ భారతీయులెవరైనా తమ భార్యలను పట్టించుకోకపోతే భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి వెసులుబాటు ఏదీ లేకపోవడంతో మహిళలు, తమ భర్తలు తమను వదిలేశాక తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. తాజా ప్రపోజల్‌ ప్రకారం విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులు తమ పెళ్ళిని ఇండియాలో రిజిస్టర్‌ చేసుకోవాల్సి వుంటుంది. ఆ సమయంలోనే వారి పాస్‌పోర్ట్‌ డిటెయిల్స్‌ తీసుకుంటారు. ఒకవేళ భార్యను భర్త వదిలేస్తే, ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే భర్త తాలూకు ఆస్తుల్ని జప్తు చేయడం, పాస్‌పోర్ట్‌ని రద్దు చేయడం చేస్తారు. ఈ ప్రపోజల్‌ వల్ల చాలామందికి మేలు కలుగుతుందనీ, అక్రమార్కులకు చెక్‌ పెట్టవచ్చునని యూఏఈ రెసిడెంట్స్‌ అభిప్రాయపడుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com