పుల్వామా ఉగ్రదాడి లో 49కి చేరిన అమరజవాన్ల సంఖ్య
- February 16, 2019
పుల్వామా ఉగ్రదాడితో….. అమరులైన జవాన్ల సంఖ్య 49కి చేరింది. శ్రీనగర్ 92 వబేస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు తెలిపారు. మరోవైపు టెర్రరిస్టుల దాడితో…. ఇప్పుడు దేశం యావత్తు రగిలిపోతోంది. అటు దీనికి బదులుచెప్పేందుకు మోదీ సర్కారు సైతం సిద్ధమవుతోంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడికి ఏవిధంగా బదులివ్వాలన్న అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలిపునిచ్చారు. టెర్రరిస్టులు మూల్యం చెల్లించక తప్పదంటూ ఇప్పటికే ప్రకటించిన మోదీ…. ఆ దిశగా … చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
అందులో భాగంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రధాన పార్టీల నేతలతో ప్రధాని నేతృత్వంలోని కీలక కమిటీ ఇవాళ పార్లమెంట్ లైబ్రరీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్రం తీసుకోనుంది…
పుల్వామా ఘటననను అటు కేంద్రం, ఇటు విపక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. రాజకీయాలకు తావులేకుండా దేశం యావత్తు పని చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో అంతా కలిసి కట్టుగా ఉన్నామన్న సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్ధేశంతోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అటు.. కేంద్రానికి అండగా నిలుస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళలర్పిస్తూ, పాక్ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు..
2016లో యూరీ బేస్ క్యాంప్‌పై ఉగ్రదాడి జరిగినప్పుడు ఎన్డీయే సర్కారు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత జరుగబోతున్న ఆల్‌పార్టీ మీటింగ్ ఇదే కావడం విశేషం. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌తో తిప్పికొట్టడమా లేక ప్రత్యక్ష దాడికి దిగకుండా పాక్‌ను టార్గెట్ చేయడామా అన్న అంశంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నారు..
అటు… కేంద్రం ఆదేశాల కోసం ఆర్మీ ఎదురుచూస్తోంది. ఇప్పటికే సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ తీవ్ర హెచ్చరికలు చేసింది. దాడిని కోట్ చేస్తూ.. తాము దాడిని మర్చిపోం..దాడి చేసిన వారిని క్షమించబోమంటూ రగిలిపోతున్నారు సైనికులు. పుల్వామా దాడిలో అమరులైన వారికి సెల్యూట్ చేస్తున్నామంటూ ట్వీట్ చేశారు. అమరులైన సోదరుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..