జవాన్లకు కన్నీటి వీడ్కోలు...

- February 16, 2019 , by Maagulf
జవాన్లకు కన్నీటి వీడ్కోలు...

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆమరులైన జవాన్ల ‌మృత దేహాలు స్వస్థలానికి తరలించారు. ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిలో వీర మరణం పొందిన సైనికులకు దేశం మెుత్తం కన్నీటి విడ్కోలు పలుకుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, మిత్రుల అశ్రు నయనాల మధ్య అధికార లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహిస్తున్నారు.

 

ఉత్తరఖండ్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ మోహన్‌లాల్‌ పార్థివ దేహాం స్వస్థలం డెహ్రాడూన్‌కు చేరుకుంది. ఆ వీర జవాన్ పార్థివ దేహాన్ని చూసిన ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి మృతదేహాన్ని చూసిన మోహన్‌లాల్‌ కుమార్తె ఉద్వేగానికి గురైంది.కన్నీటిని దిగమింగుకుని కడసారిగా అతనికి సెల్యూట్‌ చేసింది. ఆమె సెల్యూట్‌ చేసిన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది. మోహల్ లాల్ మృతదేహానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల నేతలు నివాళులర్పించారు.

అమర జవాన్ల పార్థివ దేహాలను వారి స్వస్థలాలకు చేర్చారు ఆర్మీ అధికారులు. కడసారి చూపు కోసం జవాన్ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాడిలో చనిపోయిన 44 మంది జవాన్లలో అత్యధికంగా యుపి నుండి 12 మంది జవాన్లు ఉన్నారు. అలాగే దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమరుల మృతదేహాలు వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. ఆమర వీరుల గ్రామాలు శోక సంద్రంలో మునిగిపోయాయి వారిని చూసేందుకు సామాన్య జనాలు భారీగా తరలివస్తున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com