గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌ని హోస్ట్ చేయనున్న సౌదీ అరేబియా
- February 16, 2019
రియాద్:సౌదీ రాజధాని రియాద్, గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ 2019కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఏప్రిల్‌లో ఈ ఈవెంట్ జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, చైర్మన్ ఆఫ్ జనరల్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ నబిల్ అల్ అమౌది మాట్లాడుతూ, కింగ్ సల్మాన్ ఏవియేషన్ సెక్టార్‌కి అందిస్తున్న మద్దతు చాలా గొప్పదని కొనియాడారు. కింగ్ పర్యవేక్షణలో ఏప్రిల్ 1 మరియు 2 తేదీల్లో రిట్జ్ కార్ల్‌టన్ - రియాద్‌లో జరుగుతుందని అన్నారు. ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో సౌదీ అరేబియా మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించేందుకు ఈ సమ్మిట్ ఎంతగానో ఉపయోగపడ్తుందని చెప్పారాయన. పలు అంతర్జాతీయ అంశాలు ఈ వేదికపై చర్చకు వస్తాయి. ప్రధానంగా సేఫ్టీ, సెక్యూరిటీ, ఎన్విరాన్‌మెంటల్ ప్రొటక్షన్, ఇన్నోవేషన్ మరియు ఏవియేషన్ టెక్నాలజీ తదితర అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు.
తాజా వార్తలు
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!







