పుల్వామా టెర్రర్ ఎటాక్: అమరవీరులకు యూఏఈలో ఘన నివాళి
- February 18, 2019
యూఏఈ:యూఏఈలోని భారతీయులు, పుల్వామా టెర్రర్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, దుబాయ్‌లోని కాన్సులేట్ వద్ద ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భారతీయులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవల్ని కొనియాడుతూ, వారికి నివాళులర్పించడం జరిగింది. ఫిబ్రవరి 14న కాశ్మీర్‌లోని పుల్వామాలో తీవ్రవాదులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లక్ష్యంగా జరిపిన దాడిలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు అండగా వుండడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు. జరిగిన ఘటనను ఎప్పటికీ మర్చిపోబోమనీ, బదులు తీర్చుకుంటామని ఈ సందర్భంగా సూరి నినదించారు. దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, అమరవీరులకు నివాళులర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా వుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..