భారతదేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటన
- February 20, 2019
సౌదీ క్రౌన్ ప్రిన్స మొహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశం చేరుకున్నారు. పాకిస్తాన్ పర్యటనను ముగించుకుని భారత్‌కి చేరుకున్న సౌదీ క్రౌన్స్ ప్రిన్స్‌కి భారత ప్రభుత్వం స్వాగతం పలికింది. ఎయిర్‌పోర్ట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ని కలిశారు. భారత్ - పాక్ మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ సౌదీ క్రౌన్ ప్రిన్స్ పాక్ పర్యటన ముగించుకుని, భారత్‌కి రావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ - సౌదీ అరేబియా మధ్య సంబంధాలు, అలాగే ప్రపంచానికి పెను ముప్పుగా మారిన తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్ భారత పరట్యనలో చర్చలు జరిగే అవకాశం వుంది. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు సంబంధించి సైతం మోడీ - క్రౌన్ ప్రిన్స్ మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సౌదీ - భారత్ మధ్య 27.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..