అబుదాబీలో 35 ఏళ్ళ తర్వాత అరేబియన్ కరకాల్ గుర్తింపు
- February 23, 2019
ఎన్విరాన్‌మెంటల్ ఏజెన్సీ - అబుదాబీ (ఇఎడి), అరేబియన్ కార్కాల్ (కార్కాల్ ష్మిత్జి)ని జబెల్ హఫీత్ నేషనల్ పార్క్ - అల్ అయిన్‌లో గుర్తించారు. మీడియం సైజులో ఇసుక రంగులో వుండే క్యాట్, నల్లటి చెవుల్ని కలిగి వుంటుంది. అబుదాబీలో చివరిసారిగా 1984లో ఇది కన్పించింది. అరబిక్‌లో అల్ వషాక్ అని దీన్ని పిలుస్తారు. ముఖ్యమైన, అంతరించే దశలో వున్న జీవుల్ని అన్వేషించేందుకోసం ఏర్పాటు చేసిన లాంగ్ టెర్మ్ మానిటరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 45 కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తుండగా, వాటికి ఈ కారకాల్ చిక్కింది. రాత్రి వేళల్లోనూ, పగటి వేళల్లోనూ ఈ కారకాల్ సంచరిస్తుంది. పక్షుల్ని, రోడెంట్స్‌నీ, చిన్న చిన్న జీవుల్ని వేటాడి తినే కారకాల్, నీటిని తాగకుండా ఎక్కువ రోజులు వుండగలదు.
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!







