పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి
- February 26, 2019
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మూడు చోట్ల భారత వైమానిక దళం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారత వైమానిక దళానికి చెందిన 12 యుద్ధ విమానాలు పాలుపంచుకున్నాయి. భారత వైమానిక దళం దాడితో, ఉగ్ర స్థావరాల్లో వున్న సుమారు 350 మందికి పైగా తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ దాడిని పాకిస్తాన్ ఖండిస్తుండగా, భారతదేశంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇటీవల పుల్వామాలో తీవ్రవాద ఘటనతో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఆ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పీఓకేపై వైమానిక దాడులకు రూపకల్పన చేసింది. ఇదిలా వుంటే, పాకిస్తాన్ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశం వుందన్న కోణంలో సరిహద్దుల్లో భారత సైన్యం, పూర్తిస్థాయిలో మోహరించింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







