పీడియాట్రిక్‌ ఓరల్‌ సస్పెన్షన్‌ని రీకాల్‌ చేసిన యూఏఈ మినిస్ట్రీ

- February 27, 2019 , by Maagulf
పీడియాట్రిక్‌ ఓరల్‌ సస్పెన్షన్‌ని రీకాల్‌ చేసిన యూఏఈ మినిస్ట్రీ

మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ప్రివెన్షన్‌, పీడియాట్రిక్‌ ఓరల్‌ ససెన్షన్‌ మెడిసిన్‌ని రీకాల్‌ చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. బ్యాచ్‌ నెంబర్‌ 0621 - ప్రోఫినాల్‌ 100 ఎంజి/5ఎంఎల్‌ సస్పెన్షన్‌ని యూఏఈ ఫార్మసీస్‌ నుంచి విత్‌ డ్రా చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గల్ఫ్‌ ఫార్మాష్యూటికల్స్‌, జుల్ఫర్‌ ఈ ప్రోడక్ట్‌ని తయారు చేస్తోంది. యూఏఈ హెల్త్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ గైడ్‌లైన్స్‌కి అనుగుణంగా ఈ మందు తయారలేదని అధికారులు అంటున్నారు. పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్‌కి సంబంధించిన ఫార్మసీస్‌, మెడికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ ఈ ప్రోడక్ట్‌ని సప్లయర్‌కి రిటర్న్‌ చేయాల్సి వుంటుందని ఆదేశాల్లో పేర్కొంది మినిస్ట్రీ. ఇప్పటికే వాడుతున్నవారు ప్రత్యామ్నాయ మందుల్ని ఎంచుకోవాలనీ, వైద్యులు ఈ మెడిసిన్‌ని ప్రిఫర్‌ చేయారాదనీ, సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడ్డవారు మినిస్ట్రీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. తలనొప్పి, మజిల్స్‌ నొప్పి, కామన్‌ కోల్డ్‌, పంటి నొప్పి, వెన్ను నొప్పితో బాధపడేవారికి ఈ మందుని వినియోగిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com