భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్.. తలపట్టుకున్న ఇమ్రాన్‌ ఖాన్

- February 27, 2019 , by Maagulf
భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్.. తలపట్టుకున్న ఇమ్రాన్‌ ఖాన్

భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్స్‌ పాకి స్థాన్‌లో వణుకు పుట్టించాయి. ఇండియన్‌ ఆర్మీ ఇలా దాడులు చేస్తుందని ఊహించనే లేదు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్. దీంతో ఎలా స్పందించాలో అర్ధం గాక తలపట్టుకుంటున్నారాయన. మరోవైపు గంటకో పాట, పూటకో మాట అన్నట్లుగా వ్యవహరించి తమ దేశ ప్రజల్ని తికమక పెట్టింది పాక్‌ ప్రభుత్వం. అసలు వైమానిక దాడులు చేయలేదని బుకాయించింది.

ప్రధాని, ఆర్మీలు పరస్పరం విరుద్దంగా మాట్లాడడంతో పాకిస్థాన్‌ నవ్వులపాలంది. ఆ దేశ రక్షణ మంత్రి పర్వేజ్ ఖటక్ వ్యాఖ్యలతో మరింత అబాసు పాలైంది. భారత్‌ను తిప్పికొట్టేందుకు తమ వైమానిక దళం సిద్ధంగానే ఉన్నా.. రాత్రివేళ చీకటిగా ఉండడంతో స్పందించలేదంటూ పర్వేజ్ ఖటక్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ ను అంతర్జాతీయంగా తలదించుకునేలా చేశాయి.
ఇంటా, బయటా విమర్శలు వెల్లువెత్తడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందుబాటులో ఉన్న కీలక మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారరు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌. అనంతరం జాతీయ భద్రతా దళంతో భేటీ అయ్యారు. భారత్‌ దాడులకు తాము సమయం, సందర్భం చూసుకొని సరైన సమాధానమిస్తామన్నారు.

మరోవైపు భారత్ సర్జికల్‌ స్ట్రైక్స్‌పై చర్చించేందుకు పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఇవాళ అత్యవసర సమావేశం కానుంది. ఈ సమావేశానికి తప్పక హాజరుకావాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆదేశాలను జారీచేశారు. భారత దాడికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలన్న దానిపై ఇందులో చర్చించనున్నారు. అటు.. భారత విమానాలు నియంత్రరేఖను ఉల్లంఘించాయంటూ పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com