అబుదాబి చేరిన భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్

- March 01, 2019 , by Maagulf
అబుదాబి చేరిన భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్

అబుదాబి: ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అబుదాబి చేరారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్న సుష్మ.. ఓఐసీ భాగస్వామ్య దేశాలతో భారత్ సంబంధాలపై ప్రసంగించనున్నారు. దీనికోసం యూఏఈ విదేశాంగ మంత్రి హెచ్‌హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రత్యేకంగా సుష్మను ఆహ్వానించారు. ఈ సమావేశానికి భారత్ హాజరైతే తాము పాల్గొనబోమని పాక్ బెదిరించినా. వారి బెదిరింపులను లెక్కచేయని నహ్యాన్ సుష్మను సమావేశానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే అబుదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయెద్ స్వయంగా ఇరుదేశాల ప్రధానులతో మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించువాలని సూచించినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com