మోడీ ఇమ్రాన్‌లతో మాట్లాడిన షేక్ మొహమ్మద్.!
- March 01, 2019
భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరు దేశాల ప్రధాన మంత్రులతో ఫోన్లో మాట్లాడినట్లు యుఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ చెప్పారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు చెప్పిన క్రౌన్ ప్రిన్స్ చర్చలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్‌తోనూ, నరేంద్రమోడీతోనూ విడి విడిగా మాట్లాడినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యుఏఈ ఇరుదేశాలతోనూ స్నేహ సంబంధాలు కోరుకుంటోందని ఆయా దేశాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి ఉంటున్నారనీ, అందరూ శాంతిని కోరుకుంటున్నారనీ ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే భారత వైమానిక దళానికి చెందిని వింగ్ కమాండర్ అభినందన్‌ని విడుదల చేసేందుకు ఇమ్రాన్‌ఖాన్ సుముఖత వ్యక్తం చేశారు. కాసేపట్లో అభినందన్‌ని విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







