కన్నూర్ నుంచి మస్కట్‌కి సేవలు ప్రారంభించిన గో-ఎయిర్
- March 02, 2019
మస్కట్: భారతదేశానికి చెందిన గో-ఎయిర్, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్‌కి విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. కన్నూర్ నుంచి మస్కట్‌కి వారంలో మూడు విమానాల్ని నడిపేందుకు గో-ఎయిర్ సన్నాహాలు చేసినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. గో-ఎయిర్ సేవలు ప్రారంభమవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఒమన్ ఎయిర్ పోర్ట్స్, గో ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కుటుంబంలో చేరడం ఆనందంగా వుందని చెప్పారు. మార్చి 1న మస్కట్ విమానాశ్రయానికి గో-ఎయిర్ విమానం చేరుకుందని అధికారులు తెలిపారు. కన్నూర్ నుంచి మస్కట్‌కి, మస్కట్ నుంచి న్నూర్‌కి వారంలో మూడుసార్లు విమానాలు తిరగనున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







