మరోసారి ఇరుకునపడ్డ పాకిస్థాన్‌

- March 03, 2019 , by Maagulf
మరోసారి ఇరుకునపడ్డ పాకిస్థాన్‌

ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ (ఎయిర్ స్ట్రైక్స్) చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులో 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఈ దాడులకు ఆధారాలు చూపించాలని మమతా బెనర్జీ, కాంగ్రెస్ వంటి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు పాక్‌లోని బాధితులే ఆ తమపై దాడులు జరిగాయని, తామా చాలామందిని కోల్పోయామని ప్రకటించారు.

మాపై దాడి జరిగింది, అంగీకరించిన జైష్ ఎ మహ్మద్
జైష్ ఏ మహ్మద్ తొలిసారిగా తమపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి జరిగిందని, తాము నష్టపోయామని ప్రకటించింది. బాలాకోట్‌లోని తమ మదర్సా తలీమ్ ఉల్ ఖురాన్ పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసిందని చెప్పింది. ఇక్కడ జీహాదీలకు శిక్షణ ఇస్తామని చెప్పింది. ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తున్న భారత్‌లోని విపక్షాలకు ఇది గట్టి దెబ్బ. ఎందుకంటే మోడీని టార్గెట్ చేసే ఉద్దేశ్యంతో వారు ఆర్మీని అవమానించేలా మాట్లాడుతున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు స్వయంగా బాధిత జైష్ ఏ మహ్మద్ ప్రకటన చేసింది. ఈ మేరకు జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు మౌలానా అమ్మర్ దాడి జరిగిందని అంగీకరించాడు. ఈ మేరకు టేప్ విడుదలైనట్లుగా జాతీయ మీడీయాలో వార్తలు వచ్చాయి.

బాలాకోట్‌లోని మదర్సాపై బాంబులు వేశారు
అంతేకాదు, భారత్‌కు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో జమ్ము కాశ్మీర్‌లో మరిన్ని ఆత్మాహుతి దాడులు కూడా జరుగుతాయని మౌలానా అమ్మర్ చెప్పాడట. పుల్వామా దాడి అనంతరం ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ద్వారా భారత్.. పాక్ పైన యుద్ధం ప్రకటించిందని అతను చెప్పాడు. వారు పాకిస్తాన్‌లోకి వచ్చి బాంబుల వర్షం కురిపించారని, బాలాకోట్‌లోని తమ మదర్సాలోను బాంబులు వేశారని చెప్పాడు.

మాపై దాడి చేయడం ద్వారా భారత్ రెచ్చగొట్టింది
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ హెడ్ క్వార్టర్స్ తదితరాల పైన దాడి చేయలేదని, అలాగే జీహాదీ రిక్రూట్మెంట్స్, శిక్షణ కాశ్మీర్‌లో ఉంటుందని చెప్పాడు. తమ ట్రెయినింగ్ క్యాంపులపై దాడి చేయడం ద్వారా భారత్ జీహాదీలను రెచ్చగొట్టిందని చెప్పాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో మౌలానా ఓ సోదరుడు, బ్రదర్ ఇన్ లా కూడా చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.

2018 డిసెంబర్‌లో చివరిసారి కనిపించాడు
కాగా, మసూద్ అజహర్... మదర్సా తలీమ్ ఉల్ ఖురాన్‌ను నడుపుతున్నాడు. ఈ సంస్థ మౌంట్ జాబాలో ఉంది. ఇది ఇస్లామాబాద్‌కు వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. మసూద్ అజహర్ జైష్ ఎ మహ్మద్ చీఫ్ కాగా, ఆఫ్గనిస్తాన్, కాశ్మీర్‌లలో ఈ సంస్థ కార్యకలాపాలను అమ్మర్ చూస్తున్నాడు. 2018 డిసెంబర్‌లో పెషావర్‌లో అతను చివరిసారి కనిపించాడు. అప్పుడు మాట్లాడుతూ.. భారత్, అమెరికాపై తమ దాడులు కొనసాగుతాయని హెచ్చరించాయి.

భారత్‍‌కు తలవంచావ్.. ఇమ్రాన్‌పై జైష్ ఆగ్రహం
బాలాకోట్‌లోని తమ క్యాంపులపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసి, తమకు నష్టం చేసిన నేపథ్యంలో ప్రతీకారంగా ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉండాలని మసూద్ అజహర్ సోదరుడు అమ్మర్ పిలుపునిచ్చాడట. అంతేకాదు, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైన అతను మండిపడ్డాడు. దొరికిన కమాండర్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించడాన్ని అతను తప్పుబట్టాడు. పైలట్ అభినందన్‌ను అప్పగించడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మన శత్రువు (భారత్) ముందు తలవంచాడని అమ్మర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఆ వీడియోలో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి కారణంగా జైష్ ఎ మహ్మద్‌కు పెద్ద దెబ్బ పడిందని అమ్మర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, రిక్రూట్‌మెంట్, ట్రెయినింగ్ డ్రైవ్‌ను కూడా మార్చాలని కూడా యోచిస్తున్నట్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com