ఎంతమంది చనిపోయారో ఎయిర్ ఫోర్స్ లెక్కించదు: ఎయిర్ చీఫ్ మార్షల్
- March 04, 2019
న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సర్జికల్ స్ట్రైక్స్ 2 (ఎయిర్ స్ట్రైక్స్)పై ఆధారాలు కావాలని విపక్షాలు పదేపదే అవమానించేలా మాట్లాడుతున్నాయి. ఈ దాడి వల్ల తీవ్రవాదులు ఎవరూ చనిపోలేదని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయని కాంగ్రెస్ చెబుతోంది.
మిగ్ 21 బైసన్ విమానంపై ఎయిర్ చీఫ్ మార్షల్
ఈ నేపథ్యంలో ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడారు. మిగ్ 21 బైసన్ యుద్ధ విమానం మంచి సామర్థ్యం కలిగిన ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పారు. ఇది అప్ గ్రేడ్ చేయబడిందన్నారు. ఇది మంచి రాడార్ వ్యవస్థను, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్‌ను, మంచి ఆయుధ వ్యవస్థ కలిగి ఉందని చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించారు
లక్ష్యాలను క్లియర్‌గా నిర్దేషించుకున్నామని తెలిపారు. మేం మా లక్ష్యాలను చేరుకోకుంటే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించాడని ప్రశ్నించారు. మేం వారికి సంబంధం లేని అడవుల్లో బాంబులు జారవిడిస్తే పాక్ ప్రధాని ఎలా స్పందింస్తాడో చెప్పాలన్నారు. తాము తమ టార్గెట్‌ను పూర్తి చేశామని చెప్పారు.
ఎంతమంది చనిపోయారో ఎయిర్ ఫోర్స్ లెక్కించదు
ఈ దాడిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారనే విషయం ఎయిర్ పోర్స్ లెక్కించలేదని, ప్రభుత్వం ఆ పని చేస్తుందని తెలిపారు. ఈ దాడిలో ఎంతమంది తీవ్రవాదులు మృతి చెందారనే అంశంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లెక్కించమని, ఆ లెక్క ప్రభుత్వం చెబుతుందన్నారు. తమ దాడిలో ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారనే విషయం పక్కన పెడితే, తాము టార్గెట్‌ను (ఉగ్రవాద శిబిరాల ధ్వంసం) చేధించామా లేదా అనేది తమకు చాలా ముఖ్యమని చెప్పారు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని అభిప్రాయపడ్డారు.
విరోధి దాడి చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఏది అనే సంబంధం లేదు
అత్యాధునిక పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని మన మిగ్ 21 సమర్థవంతంగా ఢీకొట్టిందనే అంశంపై కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా స్పందించారు. ఎవరైనా ఆపరేషన్ ప్లాన్ చేస్తే, ఓ ప్రణాళిక ప్రకారం ఉంటుందని, అప్పుడు పరిస్థితి ఒకలా ఉంటుందని చెప్పారు. కానీ మనపై విరోధి దాడి చేసిన సమయంలో మనకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతామని, అది ఏ ఎయిర్ క్రాఫ్ట్ అనేది సంబంధం లేకుండా ఢీకొనేందుకు సిద్ధమవుతామని చెప్పారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా సమర్థవంతమైనదేనని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







