దుబాయ్ స్కూల్ క్యాంపస్‌లో స్టాప్ మెంబర్ మృతి
- March 04, 2019
దుబాయ్ స్కూల్ స్టాఫ్ మెంబర్ ఒకరు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన స్కూల్ క్యాంపస్‌లోనే జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ సిమన్ ఓ కాన్నర్ ఈ మేరకు పేరెంట్స్‌కి సర్క్యులర్ జారీ చేశారు. దురదృష్టకర సంఘటన స్కూల్‌లో జరిగిందనీ, రేపు యధాతథంగా స్కూల్ తెరవబడ్తుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఘటన గురించి సంబంధిత అధికార వర్గాలకు సమాచారం అందించామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. సిబ్బంది మరణమెలా సంబంధించిందన్నదానిపై ప్రత్యక్షంగా చూసినవారెవరూ లేకపోవడం గమనార్హం. మృతుడ్ని కేరళకు చెందిన వ్యక్తిగా స్కూల్ యాజమాన్యం పేర్కొంది. ఉదయం నుంచీ సరదాగా వున్న వ్యక్తి హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు తోటి సిబ్బంది చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







