హీరో: విజయ్ దేవరకొండ + నయన్
- March 05, 2019
యూత్ స్టార్ విజయ్ దేవరకొండ అతి తక్కువ టైంలోనే ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సెన్సేషన్ స్టార్‌కి సౌత్‌లోనే కాదు నార్త్‌లోను ఫుల్ క్రేజ్ ఉంది. అయితే తెలుగులో విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన విజయ్ దేవరకొండ నోటా చిత్రంతో తమిళ ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇప్పుడు మరో బైలింగ్యువల్ చిత్రంతో కోలీవుడ్ మార్కెట్‌పై పట్టు బిగించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయనున్నాడట. ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తుండగా, హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార అనే టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ సరిపోతుందని యూనిట్ భావిస్తుందట. మరి హీరో టైటిల్‌తో విజయ్ దేవరకొండ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ రెండు చిత్రాలు 2019లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..