హైదరాబాద్-కొలంబో మధ్య కొత్త విమాన సర్వీసు
- March 05, 2019
హైదరాబాద్:బడ్జెట్ ఎయిర్‌లైన్స్ స్పైస్ జెట్ కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది. హైదరాబాద్-కొలంబో మార్గంలో 12 కొత్త విమానాలను నడుపుతామని స్పైస్ జెట్ మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్ 12నుంచి మార్చి 31 నుంచి తమ సేవలను ప్రారంభించనున్నాయి. మంగళవారం, బుధవారాలు మినహా అన్ని రోజులు ఈ విమానాలు నడుస్తాయని పేర్కొంది. శ్రీలకం, భారత్ మధ్య డైరెక్ట్ విమాన సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారి.
దీంతోపాటు జాతీయ మార్గంలో మరో11డైరెక్ట్ విమానాలను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఇవి మార్చి 31 నుంచి సర్వీసులను ప్రారంభిస్తాయని స్పైస్ జెట్ వెల్లడించింది.
హైదరాబాద్- కొలంబో(శ్రీలంక రాజధాని) డైరెక్ట్ సర్వీసులు భారతదేశం శ్రీలంకల మధ్య సంబంధాలకు మద్దతిచ్చేలా తమ నిబద్ధతను మరింత బలపరుస్తోందని స్పైస్ జెట్ చీఫ్ సేల్స్ అండ్ రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భాటియా చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







