విమానయాన సంస్థలు వరుసగా ఆఫర్ల

- December 29, 2015 , by Maagulf
విమానయాన సంస్థలు వరుసగా ఆఫర్ల

కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా.. ప్రముఖ విమానయాన సంస్థలు వరుసగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇతర విమానయాన సంస్థలతో పోటీ పడుతూ డిస్కౌంట్ల మోత మోగించేస్తున్నాయి. దేశీయ, విదేశీ టిక్కెట్లపై ప్రత్యేక ఆఫర్లతో ప్రయాణికుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో ప్రయాణికుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దేశీయ విమాన టిక్కెట్లపై 5శాతం, కొన్ని ఎంపిక చేసిన విదేశీ రూట్ల టిక్కెట్లపై 10శాతం మేర డిస్కౌంట్‌ని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆఫర్ల కింద టిక్కెట్ల బుకింగ్‌ మంగళవారం రాత్రి వరకు చేసుకోవచ్చునని వెల్లడించింది. ఈ టిక్కెట్లను 2016 జనవరి 16 నుంచి ఏప్రిల్‌ 23లోపు ఉపయోగించుకోవచ్చునని పేర్కొంది. స్పైస్‌ జెట్‌ విమానయాన సంస్థ హ్యాపీ న్యూ ఇయర్‌ సేల్‌ పేరుతో ఆఫర్లను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ లోపు ప్రయాణాలు చేయాలనుకునే వారు ఈ డిస్కౌంట్‌ సేల్‌ కింద టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చునని చెప్పింది. తమ దేశీయ విమాన సర్వీసుల్లో ఒకవైపు ప్రయాణ టిక్కెట్టు ప్రారంభ ధర కనిష్ఠంగా రూ.716(పన్నులు అదనం) అని తెలిపింది. డిసెంబరు 31 నుంచి నాలుగు రోజుల పాటు ఈ ప్రత్యేక ఆఫర్లలో టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చునని చెప్పింది. భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా కూడా దేశీయ ఎకానమి క్లాస్‌ టిక్కెట్లపై ఐదుశాతం, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ విమాన టిక్కెట్లపై పది శాతం డిస్కౌంట్‌ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన విదేశీ రూట్లకు సైతం టిక్కెట్లపై ఆఫర్లు ఉన్నాయని చెప్పింది. తమ అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌ల ద్వారా ఈ ఆఫర్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చునని ప్రకటించింది. ఇతర వివరాలకు తమ వెబ్‌సైట్‌ని చూడవచ్చని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com